ఆండ్రాయిడ్ 9.0 పి అప్‌డేట్ పొందనున్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!


Sun,August 12, 2018 06:01 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0 పై ని ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ ఇప్పటికే గూగుల్‌కు చెందిన పిక్సల్ డివైస్‌లకు లభిస్తున్నది. త్వరలో మరిన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లకు కూడా ఈ ఓఎస్ అప్‌డేట్ లభ్యం కానుంది. ఈ క్రమంలోనే మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ పొందనున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను తాజాగా ప్రకటించింది. హెచ్‌టీసీ యూ12 ప్లస్, యూ11 ప్లస్, యూ11, యూ11 లైఫ్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను అతి త్వరలోనే అందివ్వనున్నట్లు హెచ్‌టీసీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

2701

More News

VIRAL NEWS