కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పీ


Tue,July 10, 2018 09:13 PM

కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ భారత్‌లో రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను ఇవాళ విడుదల చేసింది. హెచ్‌పీ పెవిలియన్ 15, హెచ్‌పీ ఓమెన్ 15 పేరిట ఈ రెండు ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. హెచ్‌పీ పెవిలియన్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ 8వ జనరేషన్ ప్రాసెసర్ (ఐ5/ఐ7), 4జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.74,990గా ఉంది.

అలాగే హెచ్‌పీ ఓమెన్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్, 8/16 జీబీ ర్యామ్, 32 జీబీ వరకు ర్యామ్ అప్‌గ్రేడ్ సపోర్ట్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, 4జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, డ్యుయల్ బ్యాండ్ వైఫై తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.1,05,990 గా ఉంది.

1909

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles