హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్360 విడుదల


Sun,August 11, 2019 02:22 PM

ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ తన నూతన క్రోమ్‌బుక్‌ను.. క్రోమ్‌బుక్ ఎక్స్360 పేరిట తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 8వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రాహెచ్‌డీ గ్రాఫిక్స్, 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ వెబ్ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ క్రోమ్‌బుక్‌ను ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ క్రోమ్‌బుక్‌కు చెందిన ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ వేరియెంట్ ధర రూ.44,990 ఉండగా, కోర్ ఐ5 మోడల్ ధర రూ.52,990గా ఉంది. అతి త్వరలోనే ఈ క్రోమ్‌బుక్ అన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ విక్రయించనున్నారు.

805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles