స్పైవేర్ యాప్స్‌కు చెక్ పెట్టండిలా..వీడియో


Tue,November 5, 2019 11:36 AM

టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం మనం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే అనేక పనులు చేసుకుంటున్నాం. అయితే టెక్నాలజీ వల్ల మనం ఎంత లాభపడుతున్నామో.. దాంతో మనం అంతే నష్టపోతున్నాం. . ఇటీవలి కాలంలో వాట్సాప్ ద్వారా స్పైవేర్‌లను వ్యాప్తి చేస్తూ కేటుగాళ్లు నూతన తరహా సమాచార దోపిడీకి పాల్పడుతున్నారు. ఫోన్లకు వాట్సాప్‌లో పలు లింక్‌లకు చెందిన మెసేజ్‌లను పంపుతూ యూజర్లు వాటిని ఓపెన్ చేసేలా చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్లలో స్పైవేర్ వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తం అయి ఉండే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలతోపాటు బ్యాంకింగ్ సమాచారాన్ని దుండగులు చోరీ చేస్తున్నారు. ఆ తరువాత వినియోగదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. అలా కాకుండా ఉండాలంటే ఈ కింది వీడియోలో సూచించిన‌ యాంటీ స్పైవేర్ యాప్స్‌ను మీ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకోండి..!

2072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles