మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో అనుసంధానించండిలా!


Sun,September 10, 2017 10:16 PM

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్ ను ప్ర‌తి విష‌యంలోనూ త‌ప్ప‌ని స‌రి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదివ‌ర‌కు ఆధార్ నెంబ‌ర్, పాన్ నెంబ‌ర్ లింక్... ఆధార్ నెంబ‌ర్, బ్యాంక్ అకౌంట్ లింక్.. గ్యాస్, ఆధార్ నెంబ‌ర్ లింక్.. ఇలా ప్ర‌తి దానికి ఆధార్ ను లింక్ చేసిన‌ట్లు ఇప్పుడు మొబైల్ నెంబ‌ర్ ను కూడా ఆధార్ తో లింక్ చేసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి.

మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో లింక్ చేసుకోవ‌డానికి ఫిబ్ర‌వ‌రి 2018 వ‌ర‌కే గ‌డువు గా పేర్కొంటూ ఫిబ్ర‌వ‌రి 2017 లోనే సుప్రీం తీర్పు చెప్పింది. స‌రిగ్గా ఒక సంవ‌త్స‌రం లోపున ప్ర‌తి మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో వెరిఫై చేసుకోవాల్సిందిగా సుప్రీం పేర్కొన్న‌ది. ఒక‌వేళ ఫిబ్ర‌వ‌రి 2018 లోపు మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ తో లింక్ చేసుకోలేక‌పోతే ఆ మొబైల్ నెంబ‌ర్ సిమ్ ను డియాక్టివేట్ చేయాల్సిందిగా టెలికం కంపెనీల‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాల్సిందిగా వినియోగ‌దారుల‌కు టెలికం కంపెనీలే తెలియ‌జేయాల‌ని కేంద్రం తెలియ‌జేసింది. ఫోన్ నెంబ‌ర్ తో ఆధార్ సీడింగ్ వ‌ల్ల త‌ప్పుడు చిరునామాతో సిమ్ కార్డులు తీసుకొని దుశ్చ‌ర్య‌ల కోసం వాటిని ఉప‌యోగించే ఉగ్ర‌వాదులు, క్రిమిన‌ల్స్, మోస‌గాళ్ల‌కు అడ్డుక‌ట్ట వేయొచ్చ‌ని కేంద్రం కూడా భావిస్తున్న‌ది. ఎలాగూ మొబైల్ ఆప‌రేట‌ర్స్ వ‌ద్ద క‌స్ట‌మ‌ర్ కు సంబంధించిన బ‌యోమెట్రిక్ స్టోర్ అవ్వ‌క‌పోవ‌డం, క‌స్ట‌మ‌ర్ ప‌ర్స‌న‌ల్ డేటా కూడా మొబైల్ నెట్ వ‌ర్క్స్ కు యాక్సెస్ లేక‌పోవ‌డంతో త‌ప్పుడు ఐడెంటిటీతో సిమ్ తీసుకునే వాళ్లు పెరిగిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయ‌డం కోసం మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ తో అనుసంధానం చేయ‌డం వ‌ల్ల నేరగాళ్లు ఉప‌యోగించిన సిమ్ కు సీడ్ చేసిన ఆధార్ నెంబ‌ర్ ద్వారా నేర‌గాళ్లను ప‌ట్టుకొనే అవ‌కాశం ఉంటుంది.

అందుకే సుప్రీం కోర్టు ఆర్డ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క‌స్ట‌మ‌ర్ బ‌యోమెట్రిక్, ఆధార్ బ‌యోమెట్రిక్ మ్యాచ్ అయితేనే మొబైల్ నెట్ వ‌ర్క్ సిమ్ కార్డ్స్ ను యాక్టివేట్ చేస్తున్నాయి.

ఇక‌.. మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో అనుసంధానం చేయాలంటే మొబైల్ నెట్ వ‌ర్క్ ప్రొవైడ‌ర్ స్టోర్ కు వెళ్లి వాళ్లు ఇచ్చే ఫామ్ నింపి ఆధార్ కార్డ్ జీరాక్స్ జ‌త‌చేసి వాళ్లకు అందించాలి. ఫామ్ ఇచ్చిన రెండు నుంచి మూడు రోజుల్లో మొబైల్ నెంబ‌ర్ తో ఆధార్ అనుసంధానం అవుతుంది.

12984

More News

VIRAL NEWS