యాపిల్ ఐఫోన్లలో వచ్చిన ఇ-సిమ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?


Mon,September 17, 2018 12:18 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లు త్వరలో యూజర్లకు లభ్యం కానున్నాయి. అయితే వీటిలో ఈ సారి కొత్తగా డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కానీ ఈ ఫోన్లలో రెండు సిమ్ స్లాట్లు ఉండవు. కేవలం ఒకే సిమ్ స్లాట్ ఉంటుంది. మరొక సిమ్ ఇ-సిమ్ రూపంలో పనిచేస్తుంది. అయితే మరి.. ఈ ఇ-సిమ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా యాక్టివేట్ చేస్తారు..? అది ఎలా పనిచేస్తుంది..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇ-సిమ్ ఫీచర్ ఫీచర్ అంటే ఇది నిజానికి సిమ్ కార్డే. సాధారణ సిమ్ లాగే పనిచేస్తుంది. కాకపోతే సిమ్ స్లాట్ ఉండదు. కానీ ఫోన్‌లోనే ఇ-సిమ్ కోసం ఓ ఖాళీ ఎంబెడ్డెడ్ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో టెలికాం ఆపరేటర్లు సిమ్ తాలూకు సమాచారాన్ని వైర్‌లెస్‌గా పంపుతారు. అనంతరం ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఇక ఆ తరువాతి నుంచి ఇ-సిమ్‌ను సాధారణ సిమ్‌లాగే వాడుకోవచ్చు. ఇక ఐఫోన్లలో ఇ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేస్తారంటే...

1. ఐఫోన్‌లోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అందులో ఉండే సెల్యులార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2. సెల్యులార్ విభాగంలో సెల్యులార్ ప్లాన్స్ సెక్షన్‌లో యాడ్ సెల్యులార్ ప్లాన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. అనంతరం టెలికాం ఆపరేటర్ ఇచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా వారు ఇచ్చే సెట్టింగ్స్‌ను మాన్యువల్‌గా సెట్ చేసుకోవాలి.
4. సెట్టింగ్స్‌ను సెట్ చేసుకోగానే ఇ-సిమ్‌కు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. కోడ్‌ను ఎంటర్ చేయగానే ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది.

ఇలా ఐఫోన్లలో ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో వాటిల్లో డ్యుయల్ సిమ్‌ను వాడుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే రెండు సిమ్‌లలో ఒకదాన్ని ప్రైమరీగా, మరొక సిమ్‌ను సెకండరీగా సెట్ చేసుకోవాలి. ప్రైమరీగా సెట్ చేసుకున్న సిమ్ నుంచి ఇంటర్నెట్, కాల్స్, ఎస్‌ఎంఎస్, ఐమెసేజ్, ఫేస్‌టైం వంటి సేవలను వాడుకోవచ్చు. ఇక సెకండరీ సిమ్ నుంచి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే వాడుకునేందుకు వీలు కలుగుతుంది.

2584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles