ఈ నెల 22న విడుద‌ల కానున్న హాన‌ర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్


Sat,January 12, 2019 07:47 PM

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ వ్యూ20 ని ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఇందుకు గాను ఈ ఫోన్‌కు ఈ నెల 15వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. ఇక ఈఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ ఫోన్‌ను ప్రీబుకింగ్ చేసే వారికి రూ.2,999 విలువైన హాన‌ర్ స్పోర్ట్ బీటీ ఇయ‌ర్‌ఫోన్స్‌ను ఉచితంగా అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 25 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న ఇన్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో కైరిన్ 980 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 8 జీబీ ర్యామ్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరాను అమ‌ర్చారు. అలాగే 3డీ ఫొటోల‌ను తీసుకునేందుకు ప‌క్క‌నే మ‌రో కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని అమ‌ర్చారు.

హాన‌ర్ వ్యూ20 ఫీచ‌ర్లు...

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 3డీ సెకండరీ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

3159

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles