అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన హానర్ ప్లే స్మార్ట్‌ఫోన్


Mon,August 6, 2018 02:50 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ ప్లే ను గత కొంత సేపటి కిందటే భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్‌నైట్ బ్లాక్, నేవీ బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.19,999, రూ.23,999 ధరలకు వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఫోన్‌కు గాను సేల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్‌పై వొడాఫోన్ తన కస్టమర్లకు 120 జీబీ అదనపు మొబైల్ డేటాను అందిస్తున్నది.

హానర్ ప్లే స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే టర్బో గ్రాఫిక్స్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్‌లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లో 3డీ ఆడియో టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌లో ఆడియో మంచి క్వాలిటీని కలిగి ఉంటుంది. యూజర్లకు సౌండ్ విషయంలో చక్కని అనుభూతి కలుగుతుంది.

హానర్ ప్లే ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2737

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles