హాన‌ర్ ప్లే 8ఎ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Tue,January 8, 2019 03:12 PM

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ ప్లే 8ఎ ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ లేదు. డెడికేటెడ్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. రూ.8,115 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు రేప‌టి నుంచి ల‌భ్యం కానుంది.

హాన‌ర్ ప్లే 8ఎ ఫీచ‌ర్లు...
6 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1532

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles