ఈ నెల 22న విడుదల కానున్న హానర్ ప్లే 7 స్మార్ట్‌ఫోన్


Sat,May 19, 2018 08:04 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ ప్లే 7 ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. రూ.6,380 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో ముందు, వెనుక ఉన్న రెండు కెమెరాలకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. దీంతో పవర్‌ఫుల్ ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

హానర్ ప్లే 7 ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

4020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles