ఈ నెల 31న హానర్ నోట్ 10 విడుదల


Sat,July 21, 2018 06:01 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ నోట్ 10 ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో ఉన్న ఫీచర్ల గురించి కూడా హువావే వివరాలు తెలియజేయలేదు. కానీ ఈ ఫోన్‌లో 6.9 ఇంచ్ క్వాడ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కైరిన్ 970 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉండనున్నట్లు తెలిసింది. తాజాగా విడుదలైన షియోమీ ఎంఐ మ్యాక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా హువావే తన హానర్ నోట్ 10 ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు త్వరలో తెలుస్తాయి.

3997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles