ప్రపంచంలోనే మొదటి హార్ట్ రేట్ సెన్సార్ హెడ్‌ఫోన్స్ విడుదల..!


Wed,June 6, 2018 07:47 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన హెడ్‌ఫోన్స్ మోడల్ హానర్ క్లియర్ హెడ్‌ఫోన్స్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.1350 ధరకు ఈ హెడ్‌ఫోన్స్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానున్నాయి. కాగా వీటిలో హార్ట్ రేట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రపంచంలోనే హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌తో వచ్చిన మొదటి హెడ్‌ఫోన్స్‌గా హానర్ క్లియర్ హెడ్‌ఫోన్స్ రికార్డు సృష్టించాయి.


ఈ హెడ్‌ఫోన్స్‌లో కుడి ఇయర్ బడ్స్‌లో సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల హెడ్‌ఫోన్స్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసి యాప్‌లో రియల్ టైంలో హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ హెడ్‌ఫోన్స్‌కు మూడు భిన్నమైన సైజ్‌లు ఉన్న ఇయర్ బడ్స్‌ను అందిస్తున్నారు. హెడ్‌ఫోన్స్ బటన్‌పై వాల్యూమ్ కంట్రోల్స్, కాల్స్ రిసీవ్/ఎండ్ కంట్రోల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

3363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles