హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,July 29, 2018 01:23 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఎన్ ను తాజాగా విడుదల చేసింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.11,999, రూ.13,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌పై జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. 100 జీబీ అదనపు మొబైల్ డేటా జియో యూజర్లకు లభిస్తుంది. అలాగే మింత్రాకు చెందిన రూ.1200 విలువైన వోచర్లు లభిస్తాయి.

హానర్ 9ఎన్ ఫీచర్లు...


5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3662

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles