హానర్ 9ఐ 2018 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన హువావే


Wed,June 6, 2018 05:52 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 9ఐ 2018' ని ఇవాళ విడుదల చేసింది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.14,640, రూ.17,780 ధరలకు వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

హానర్ 9ఐ 2018 ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2797

More News

VIRAL NEWS