భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లేతో విడుద‌లైన హానర్ 8ఎక్స్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్


Sun,September 9, 2018 01:07 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎక్స్ మ్యాక్స్ ను తాజాగా విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.15,745, రూ.18,900 ధరలకు వినియోగదారులకు అక్టోబర్ నెలలో లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హానర్ 8ఎక్స్ మ్యాక్స్ లో 7.12 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.

హానర్ 8ఎక్స్ మ్యాక్స్ ఫీచర్లు...


7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

5349

More News

VIRAL NEWS