హానర్ 8సి స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,October 11, 2018 02:42 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.11,785, రూ.15వేల ధరలకు ఈ ఫోన్లు వినియోగదారులకు ఈ నెల 16వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి.

హానర్ 8సి ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీఈబ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1933

More News

VIRAL NEWS

Featured Articles