రూ.1వేయి త‌గ్గిన హాన‌ర్ 8సి


Mon,February 11, 2019 07:16 PM

హువావే త‌న హాన‌ర్ 7సి ఫోన్‌కు కొన‌సాగింపుగా గ‌తేడాది న‌వంబ‌ర్‌లో హానర్ 8సి ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా, ప్ర‌స్తుతం దీన్ని రూ.1వేయి త‌గ్గించారు. దీంతో ఇప్పుడీ ఫోన్‌ను రూ.10,999 ధ‌ర‌కు అమెజాన్ లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్ కు చెందిన 32 జీబీ వేరియెంట్ ఈ ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఇక ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన క‌స్ట‌మ‌ర్ల‌కు 100 జీబీ ఉచిత డేటాను జియో అందిస్తున్న‌ది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో ఫోన్‌ను కొంటే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల‌తో ఫోన్‌ను కొంటే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్లో 6.26 ఇంచుల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

7345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles