హువావే హానర్ 7సి స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,May 22, 2018 07:47 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 7సి' ని ఇవాళ విడుదల చేసింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.9,999, రూ.11,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు. 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. అలాగే ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు తోడు ముందు భాగంలో ఉన్న కెమెరాతో కూడా డివైస్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. అలాగే మెమొరీ కార్డు వేసుకునేందుకు డెడికేటెడ్ స్లాట్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు.

హానర్ 7సి ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4339

More News

VIRAL NEWS

Featured Articles