ఓపెన్ సేల్‌లో లభిస్తున్న హానర్ 7సి స్మార్ట్‌ఫోన్


Tue,June 26, 2018 07:13 PM

హువావే తన హానర్ 7సి స్మార్ట్‌ఫోన్‌ను గత నెల రోజుల కిందట విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లోనే విక్రయించారు. కానీ ఇకపై ఈ ఫోన్‌ను ఓపెన్ సేల్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్ లభిస్తున్నది. రూ.9,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి.

హానర్ 7సి ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1696

More News

VIRAL NEWS

Featured Articles