భారత్‌లో విడుదలైన హానర్ 20, హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్లు


Tue,June 11, 2019 05:20 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్లు హానర్ 20, హానర్ 20 ప్రొలను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలోనూ 6.26 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. హీట్‌ను తట్టుకునేందుకు హానర్ 20 ప్రొ ఫోన్‌లో ప్రత్యేకంగా గ్రాఫీన్ కూలింగ్ షీట్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. ఇక వీటికి వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ఈ రెండు ఫోన్లలోనూ హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

కాగా హానర్ 20 ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల చేయగా ఈ ఫోన్‌ను రూ.32,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. అలాగే హానర్ 20 ప్రొ ఫోన్‌ను రూ.39,999 ధరకు విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్లను కొన్న జియో కస్టమర్లకు ఆ కంపెనీ 2.2 టీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. ఈ ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. వీటికి 90 రోజుల కాలవ్యవధి గల 90 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను అందివ్వనున్నారు.



హానర్ 20, హానర్ 20 ప్రొ ఫీచర్లు...


6.26 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (హానర్ 20), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ (హానర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, హానర్ 20 ప్రొ - 48, 16, 8, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, హానర్ 20 - 48, 16, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ పోర్ట్రెయిట్ లైటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, హానర్ 20 - 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ 20 ప్రొ - 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

2099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles