ఈ నెల 27న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్


Sun,April 22, 2018 01:32 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 10 ను ఈ నెల 27వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. తరువాత భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదలవుతుంది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.27,230, రూ.31,420 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతో డివైస్‌ను ఫేస్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చు.

హానర్ 10 ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles