హాన‌ర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన హువావే..!


Wed,January 16, 2019 02:31 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 10 లైట్ ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.21 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.13,999 ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతుండ‌గా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.17,999 ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతున్న‌ది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. వీటిపై జియో క‌స్ట‌మ‌ర్లకు రూ.2200 క్యాష్‌బ్యాక్ వోచ‌ర్ల రూపంలో ల‌భిస్తుంది. అలాగే రూ.2800 విలువైన క్లియ‌ర్ ట్రిప్ వోచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

హాన‌ర్ 10 లైట్ ఫీచ‌ర్లు...


6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1166

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles