ఈ నెల 21న విడుదల కానున్న హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్


Sat,November 17, 2018 04:24 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 10 లైట్‌ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనుంది. బ్లూ, రెడ్, బ్లాక్, పింక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ వన్ ప్లస్ 6టి తరహాలో వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

హానర్ 10 లైట్ ఫీచర్లు...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3320 ఎంఏహెచ్ బ్యాటరీ.

1305

More News

VIRAL NEWS