హానర్ 10 జీటీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్న హువావే


Tue,July 3, 2018 08:22 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 10 జీటీని ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. ముందుగా ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. తరువాత మిగిలిన దేశాల వినియోగదారులకు లభిస్తుంది. భారత్‌లో ఈ ఫోన్ జూలై చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హానర్ 10 జీటీ ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3871

More News

VIRAL NEWS