అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Mon,September 24, 2018 04:01 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 5.1 ప్లస్ ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 5.86 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తుండగా, దీన్ని ఆండ్రాయిడ్ పి 9.0 కి అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు...
5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో లభిస్తున్నది. దీన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ఆయా సైట్లలో ఇప్పటికే ప్రారంభించారు. ఇక ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1800 క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. అలాగే 240 జీబీ అదనపు మొబైల్ డేటాను కూడా అందివ్వనున్నారు.

2905

More News

VIRAL NEWS