ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ పొందనున్న నోకియా ఫోన్లు ఇవే..!


Sat,August 24, 2019 05:44 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే మొదట గూగుల్ పిక్సల్ ఫోన్లలో ఈ ఓఎస్ అప్‌డేట్ లభిస్తుంది. తరువాత ఇతర కంపెనీలకు చెందిన పలు ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందిస్తారు. కాగా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ లభ్యం కానున్న పలు నోకియా ఫోన్ల జాబితాను హెచ్‌ఎండీ గ్లోబల్ తాజాగా విడుదల చేసింది.

నోకియా 7.1, 8.1, నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్లకు ఈ ఏడాది చివర్లోగా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందిస్తారు. అలాగే నోకియా 6.1, 6.1 ప్లస్, 7 ప్లస్, 2.2, 3.1 ప్లస్, 3.2, 4.2, నోకియా 1 ప్లస్, 5.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లకు వచ్చే ఏడాది ఆరంభంలో, నోకియా 2.1, 3.1, 5.1, నోకియా 1 ఫోన్లకు వచ్చే ఏడాది మధ్యలో ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందిస్తామని హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది.

1775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles