హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు లాగిన్ కష్టాలు


Tue,December 3, 2019 11:52 AM

ముంబై: దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ బ్యాంకుకు చెందిన నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులలోకి లాగిన్ అయ్యేందుకు కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పనిదినం నెల ఆరంభం కావడం, ఆఫర్ల సమయం కావడంతో.. ఆ బ్యాంకు సర్వర్లు మొరాయించాయి. దీంతో మంగళవారం ఉదయం వరకు కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. ఆయా అకౌంట్లలోకి లాగిన్ అవుదామని యత్నిస్తుంటే సర్వీస్ అందుబాటులో లేదని మెసేజ్‌లు వస్తున్నాయంటూ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు పెద్ద ఎత్తున ఆ బ్యాంకుకు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేశారు. అయితే మంగళవారం ఉదయం వరకు పరిస్థితి కొంత‌ మెరుగైనట్లు తెలిసింది.

సోమవారం ముఖ్యమైన లావాదేవీలు చేసుకోలేకపోయామని పలువురు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నామని, సర్వర్లకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ వచ్చినందునే ఈ సమస్య వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించి కస్టమర్లు జరిపే లావాదేవీల్లో 92 శాతం వరకు లావాదేవీలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లకు సంబంధించినవే ఉంటుండడం విశేషం..!

1076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles