ఫ్రెషియా ఎయిర్ ప్యూరిఫైర్లను లాంచ్ చేసిన హావెల్స్


Sat,November 9, 2019 05:15 PM

హావెల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ భారత మార్కెట్‌లోకి ఫ్రెషియా సిరీస్‌లో పలు నూతన ఎయిర్ ప్యూరిఫైర్లను తాజాగా ప్రవేశపెట్టింది. వీటిల్లో 9 స్టేజ్ ఎయిర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఫీచర్‌ను ఏర్పాటు చేసినందున గాలిలో ఉండే 99 శాతం కాలుష్య, ధూళి కణాలు తొలగిపోతాయి. 485 నుంచి 958 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేసే ప్యూరిఫైర్లు ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక హ్యుమిడిఫైర్, యాక్టివేటెడ్ కార్బన్, స్టెరిలైజింగ్ యూవీ లైట్, యాంటీ బాక్టీరియల్ బాల్స్, అబ్జార్బింగ్ టాక్సిక్ ఎలిమెంట్స్, ఇన్‌ఫ్యూజింగ్ ది ఎయిర్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైర్లలో అందిస్తున్నారు. ఇవి రూ.14,490 నుంచి రూ.43,290 ధరల నడుమ వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిని ఆఫ్‌లైన్ స్టోర్స్‌తోపాటు హావెల్స్ వెబ్‌సైట్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles