రూ.3,499 కే గోకీ వైటల్ ఫిట్‌నెస్ బ్యాండ్


Sat,July 14, 2018 09:14 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు గోకీ తన నూతన స్మార్ట్‌బ్యాండ్ గోకీ వైటల్ ను తాజాగా విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ అమెజాన్ సైట్, గోకీ హెల్త్ స్టోర్స్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. ఇందులో కలర్ ఓలెడ్ టచ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌తో బ్లడ్ ప్రెషర్ కొలవవచ్చు. హార్ట్ రేట్ సెన్సార్, స్టెప్ కౌంటర్, క్యాలరీ కౌంటర్, డిస్టాన్స్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్ తదితర సదుపాయాలు ఈ బ్యాండ్‌లో లభిస్తున్నాయి. ఈ బ్యాండ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేసినందున నీటిలో తడిసినా బ్యాండ్‌కు ఏమీ కాదు. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ బ్యాండ్ కనెక్ట్ అవుతుంది. అందుకు ఫోన్‌లో గోకీ యాప్‌ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

2399

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles