వచ్చేస్తుంది.. ఆండ్రాయిడ్ పి..!


Sat,August 4, 2018 04:05 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ పి (P) ని ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిసింది. గతేడాది ఆగస్టు 21వ తేదీన ఆండ్రాయిడ్ O (ఓరియో) ఓఎస్‌ను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ సారి మాత్రం ఒక్క రోజు ముందుగానే ఈ ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఆండ్రాయిడ్ పి ఓఎస్‌కు చెందిన తొలి బీటా ఎడిషన్‌ను ఇప్పటికే గూగుల్ ఐ/వో 2018లో విడుదల చేశారు. తరువాత మార్చి నెలలో తొలి డెవలపర్ ప్రివ్యూను ప్రవేశపెట్టారు. వీటిల్లో అనేక మార్పులు, చేర్పులు చేశారు. చివరకు పూర్తి స్థాయి ఓఎస్‌ను త్వరలో విడుదల చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఇక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో వైఫై ఆర్‌టీటీ, డిస్‌ప్లే కటౌట్, నాచ్ సపోర్ట్, ఎన్‌హాన్స్‌డ్ మెసేజింగ్ ఎక్స్‌పీరియెన్స్, మల్టీ కెమెరా సపోర్ట్, హెచ్‌డీఆర్ వీపీ9 వీడియో, హెచ్‌ఈఐఎఫ్ ఇమేజ్ కంప్రెషన్, అడాప్టివ్ బ్యాటరీ, గెస్చర్ సపోర్ట్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక గత ఆండ్రాయిడ్ ఓఎస్‌లలాగే ఆండ్రాయిడ్ పి కి కూడా గూగుల్ ఓ పేరు పెట్టనుంది. దాని గురించి తెలియాలంటే ఈ నెల 20వ తేదీ వరకు ఆగాల్సిందే..!

3511

More News

VIRAL NEWS