గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆండ్రాయిడ్ 10కు పేరు పెట్ట‌డం లేద‌ట‌..!


Sat,August 24, 2019 12:47 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తినుబండారాల పేర్లు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గూగుల్ రకరకాల పదార్థాల పేర్లు పెడుతూ వచ్చింది. అయితే త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎలాంటి పేరు పెట్టడం లేదని గూగుల్ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అదే పేరుతో వ్యవహరించనున్నామని, దానికి ఆండ్రాయిడ్ క్యూ అని పేరు పెట్టబోవడం లేదని గూగుల్ తెలిపింది. దీంతో ఆండ్రాయిడ్ 10 ఆదే పేరిట ఉంటుంది. ఆండ్రాయిడ్ క్యూ అని పేరు పెట్టడం లేదు కనుక, ఇక తినుబండారం పేరు కూడా దానికి ఉండదు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు ఉన్న తినబండారాల పేర్లను గుర్తు పెట్టుకోవడం కష్టతరమవుతోందని, అందుకనే ఇకపై నూతన ఆండ్రాయిడ్ ఓఎస్‌కు కేవలం ఆండ్రాయిడ్ 10 అనే పేరు మాత్రమే ఉంటుందని గూగుల్ తెలిపింది. ఆ తరువాత వచ్చే ఆండ్రాయిడ్ వెర్షన్లకు కూడా పేర్లు కాక కేవలం నంబర్లు మాత్రమే ఉంటాయని, ఆండ్రాయిడ్ 11, 12.. ఇలా నంబర్లతోనే భవిష్యత్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లను వ్యవహరిస్తామని గూగుల్ తెలిపింది.



ఇక ఆండ్రాయిడ్ లోగోను కూడా గూగుల్ పూర్తిగా మార్చేసింది. గతంలో ఆండ్రాయిడ్ అనే అక్షరాలు ఆకుపచ్చ రంగులో ఉండగా.. ఇప్పుడు వాటిని నలుపు రంగులోకి మార్చారు. అలాగే ఆండ్రాయిడ్ రొబోట్‌ను ప్రేరణగా తీసుకుని దాంతో నూతన ఆండ్రాయిడ్ లోగోను గూగుల్ తీర్చిదిద్దింది. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లో ఈ కొత్త లోగో ఉంటుందని గూగుల్ తెలిపింది.

1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles