'గూగుల్ పే' పేమెంట్ సిస్టమ్‌ను లాంచ్ చేసిన గూగుల్..!


Wed,January 10, 2018 08:29 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా ఓ నూతన పేమెంట్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్ పే, గూగుల్ వాలెట్‌లను కలుపుతూ 'గూగుల్ పే' పేరిట కొత్త పేమెంట్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం గూగుల్ పే యాప్ సేవలు ఆండ్రాయిడ్ యూజర్లకు లభిస్తున్నాయి. వారు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఇందులో సేవ్ చేసుకుని వాటి సహాయంతో కార్డ్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు. దీంతో యూజర్ల వద్ద కేవలం తమ స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. చీటికీ మాటికీ కార్డులను తీసి స్వైప్ చేయాల్సిన పని ఉండదు. పీవోఎస్ టర్మినల్ వద్ద గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేసి వేవ్ చేస్తే చాలు, పేమెంట్ ఆథరైజ్ అవుతుంది. ఇక గూగుల్ పే సహాయంతో ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సేవలు భారత్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది..!

3413

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles