మారిన యూట్యూబ్ రూల్స్.. యాడ్ రెవెన్యూ లేకపోతే చానల్స్ బ్యాన్..!


Tue,November 12, 2019 10:50 AM

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ రూల్స్‌కు మార్పులు చేర్పులు చేసింది. యూట్యూబ్‌కు చెందిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో నూతన నియమ నిబంధనలను చేర్చినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రూల్స్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందిని కలిగించేవిగా మారాయి. ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. ఆ యూజర్‌కు చెందిన యూట్యూబ్ చానల్‌ను గూగుల్ బ్యాన్ చేయనుంది. అంతేకాదు.. ఆ యూజర్ జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర ఇతర గూగుల్ సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనుంది. ఇక ఇవే రూల్స్ వెబ్‌సైట్లకు కూడా వర్తిస్తాయని గూగుల్ తెలిపింది. ఈ క్రమంలో వెబ్‌సైట్లలో ఉంచే కంటెంట్‌కు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా గూగుల్ సూచించిన విధంగా నిర్దిష్ట మొత్తంలో రెవెన్యూను సాధించలేకపోయినా ఆ యూజర్లకు చెందిన జీమెయిల్, ఇతర సర్వీసులను బ్యాన్ చేయనున్నారు. కాగా గూగుల్ మార్చిన ఈ కొత్త రూల్స్ డిసెంబ‌ర్ 10వ తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి. అయితే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లతోపాటు వెబ్‌సైట్ పబ్లిషర్లకు కూడా ఇబ్బందులు కలిగించనున్న నేపథ్యంలో ఈ విషయంపై గూగుల్ మరోసారి ఆలోచిస్తుందో, లేదో చూడాలి..!

3118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles