గూగుల్ మ్యాప్స్‌లో 3డీ గ్లోబ్ మోడ్


Mon,August 6, 2018 07:00 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ వెబ్‌సైట్‌లో 3డీ గ్లోబ్ మోడ్ అనే సరికొత్త ఫీచర్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. దీని వల్ల గూగుల్ మ్యాప్స్‌లో మ్యాప్‌ను పూర్తిగా జూమ్ అవుట్ చేస్తే మ్యాప్ సమతలమైన ఉపరితలంతో కాక, 3డీ గ్లోబ్ మాదిరిగా దర్శనమిస్తుంది. కాగా ఈ కొత్త ఫీచర్ కేవలం పీసీల్లో వాడే ఇంటర్నెట్ బ్రౌజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. క్రోమ్, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ తదితర ఇంటర్నెట్ బ్రౌజర్లలో గూగుల్ మ్యాప్స్ సైట్‌లో ఈ ఫీచర్ లభిస్తున్నది. కానీ మొబైల్ బ్రౌజర్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేలేదు. త్వరలోనే వాటిల్లోనూ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
2091

More News

VIRAL NEWS