గూగుల్ మ్యాప్స్.. ఇక తెలుగులో దారి చెబుతుంది..!


Thu,March 15, 2018 10:34 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వాడుతున్న యూజర్ల కోసం పలు కొత్త ఫీచర్లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్ యాప్ కొత్త వెర్షన్‌లో ప్లస్ కోడ్స్ పేరిట ఓ నూతన ఫీచర్ ఇప్పుడు యూజర్లకు లభిస్తున్నది. మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా లొకేషన్‌లో యూజర్ ఉన్నప్పుడు మ్యాప్స్‌లో సదరు లొకేషన్‌పై టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో అక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. దాంతోపాటే కింద యూజర్ ఉన్న ఆ ప్రదేశం గురించిన సమాచారం వస్తుంది. అలాగే అడ్రస్‌లను వెదికేందుకు ఈ కొత్త వెర్షన్‌లో స్మార్ట్ అడ్రస్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక యూజర్లు మ్యాప్స్ యాప్‌లో ఏదైనా అడ్రస్ తప్పుగా ఉందనుకున్నా, మిస్ అయింది అనుకున్నా దాన్ని ఎడిట్ చేసే వీలు కల్పించారు. అలాగే మ్యాప్స్ యాప్‌లో ఉన్న నావిగేషన్‌లో ప్రస్తుతం 6 భారతీయ భాషలకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళం, మళయాళం భాషల్లో ఇప్పుడు యూజర్లు నావిగేషన్ సేవలను పొందవచ్చు. ఆయా భాషల్లో గూగుల్ నావిగేషన్ యూజర్లకు దారి చెబుతుంది.

3426

More News

VIRAL NEWS

Featured Articles