జియో ఫోన్‌కు గూగుల్ మ్యాప్స్ యాప్..!


Wed,July 11, 2018 03:33 PM

రిలయన్స్ జియో తన జియో ఫోన్‌కు గాను ఎప్పటికప్పుడు అందించే యాప్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జియో ఫోన్‌కు గాను ఫేస్‌బుక్ యాప్‌ను విడుదల చేశారు. ఇక త్వరలో యూట్యూబ్, వాట్సాప్ యాప్‌లు కూడా జియో ఫోన్‌లో లభ్యం కానున్నాయి. అయితే వాటితోపాటు గూగుల్ మ్యాప్స్ యాప్ కూడా జియో ఫోన్‌లో అందుబాటులోకి వస్తుందని జియో వెల్లడించింది. ఆగస్టు 15న జియో ఫోన్ 2 విడుదల సందర్భంగా ఈ యాప్స్ అన్నింటినీ జియో ఫోన్‌కు విడుదల చేయనున్నారు. ఇక గూగుల్ మ్యాప్స్ యాప్ సాధారణ స్మార్ట్‌ఫోన్ యాప్‌లాగే జియో ఫోన్‌లోనూ పనిచేస్తుంది. అందులో యూజర్లు తమకు కావల్సిన ప్రదేశాలను వెదకవచ్చు. ట్రాఫిక్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

5440

More News

VIRAL NEWS