గూగుల్ తేజ్ యాప్‌లో ఇప్పుడు బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చు..!


Tue,February 20, 2018 07:03 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ గత కొద్ది రోజుల కిందట భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం తేజ్ పేరిట మొబైల్ పేమెంట్స్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ యాప్‌లో ఇప్పటి వరకు కేవలం నగదు ట్రాన్స్‌ఫర్‌కు మాత్రమే వీలుండేది. అయితే ఇకపై దీంట్లో బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. దాదాపు 90కి పైగా బిల్లర్‌ల సపోర్ట్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. వినియోగదారులు గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లలును ఇందులో చెల్లించవచ్చు. అలాగే డీటీహెచ్ రీచార్జిలను చేసుకోవచ్చు. ఇక ఇందులో వినియోగదారులు చెల్లించే ప్రతి బిల్‌కు ఒక స్క్రాచ్ కార్డు లభిస్తున్నది. దీన్ని స్క్రాచ్ చేస్తే రూ.1000 వరకు నగదును గెలుచుకునేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఫోఎన్‌లలో గూగుల్ తేజ్ అప్‌డేటెడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పైన చెప్పిన బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను పొందవచ్చు.

3578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles