ఆండ్రాయిడ్ పి వచ్చేసింది.. పేరేంటో తెలుసా..?


Tue,August 7, 2018 02:20 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని విడుదల చేసింది. దీనికి 'పై (Pie)' అని నామకరణం చేసింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.
adaptive-battery

1. అడాప్టివ్ బ్యాటరీ


గతంలో వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్‌ల కన్నా ఆండ్రాయిడ్ పి ఓఎస్‌ను బ్యాటరీ విషయంలో మరింత నూతనంగా తీర్చిదిద్దారు. ఆండ్రాయిడ్ పి ఓఎస్ ఉన్న డివైస్‌లలో మెషిన్ లెర్నింగ్ సహాయంతో బ్యాటరీ పనిచేస్తుంది. యూజర్లు ఎక్కువగా వాడే యాప్‌లను ఓ వైపు, ఎక్కువగా వాడని యాప్‌లను మరోవైపు బకెట్లనే గ్రూపులుగా విభజించి ఇనాక్టివ్‌గా ఉండే యాప్‌లకు బ్యాటరీ పవర్‌ను నియంత్రించేలా బ్యాటరీ ఫీచర్‌ను డెవలప్ చేశారు. దీంతో డివైస్ బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది.
system-navigation

2. సిస్టమ్ నావిగేషన్


గతంలో వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు భిన్నంగా ఆండ్రాయిడ్ పి లో సిస్టమ్ నావిగేషన్ గెస్చర్లను పూర్తిగా మార్చేశారు. నేటి తరుణంలో అధిక శాతం మంది యూజర్లు పెద్ద స్క్రీన్లు ఉన్న ఫోన్లను వాడుతున్న దృష్ట్యా వాటి తెరలకు అనుగుణంగా ఉండేలా ఆండ్రాయిడ్ పిలో సిస్టమ్ నావిగేషన్ గెస్చర్‌లను తీర్చిదిద్దారు. పెద్ద ఫోన్ ఉన్నప్పటికీ సింగిల్ హ్యాండ్‌తో హోమ్ స్క్రీన్, యాప్ స్క్రీన్, ఇతర విండోలకు స్క్రోల్ అయ్యే విధంగా ఓఎస్‌ను డిజైన్ చేశారు. ఒకటి కన్నా ఎక్కువ యాప్‌లను ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేసుకునే యూజర్లకు అనువుగా ఉండేలా సిస్టమ్ నావిగేషన్‌ను మార్చారు. దీంతో యాప్‌లు, హోమ్ స్క్రీన్‌ల మధ్య నావిగేషన్ సులభతరమవుతుంది.

3. ఏఐ పవర్డ్ యాప్ యాక్షన్స్


ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాప్‌లు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే విధంగా ఓఎస్‌ను తీర్చిదిద్దారు. నిర్దిష్టమైన యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలనే కమాండ్‌ను ముందుగానే యూజర్లు నిర్దేశించి పెట్టుకుంటే సదరు యాప్‌లను ఓపెన్ చేసినప్పుడు ఆ కమాండ్‌కు అనుగుణంగా యాప్ ఓపెన్ అవగానే పని ప్రారంభిస్తుంది. అంటే.. ఉదాహరణకు హెడ్‌ఫోన్స్ పెట్టుకోగానే మ్యూజిక్ ప్లేయర్ లేదా సాంగ్స్ యాప్ ఓపెన్ అవ్వాలని ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే ఇకపై ఎప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా అదే యాప్ ఓపెన్ అవుతుందన్నమాట.
Android-P0708

4. స్లైసెస్


గూగుల్ సెర్చ్‌లో యూజర్ వెదికే సమాచారాన్ని మరింత నిర్దిష్టంగా అందించేవే స్లైసెస్. వీటి వల్ల యూజర్‌కు తాను వెదకాలనుకున్న సమాచారం వేగంగా దొరకడమే కాక, తన పని కూడా సులభతరమవుతుంది. అంటే.. ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే.. గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన రైడ్ వివరాలు వస్తాయి. అందులో తమకు నచ్చిన ధరను ఎంచుకుని యూజర్ తాను వెళ్లాలనుకునే ప్రదేశానికి చేరుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.
battery-power

5. బ్యాక్‌గ్రౌండ్ రిస్ట్రిక్షన్స్


డివైస్ బ్యాటరీని ఆదా చేసుకునేందుకు గాను యాప్స్‌ను నిర్దిష్ట సమయం పాటు రిస్ట్రిక్ట్ చేయవచ్చు. అందుకు తగినవిధంగా కాలపరిమితిని యూజర్ సెట్ చేసుకోవచ్చు. దీంతో డివైస్ బ్యాటరీ ఎంతో సేవ్ అవుతుంది. అలాగే అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే వాటిని పూర్తిగా నియంత్రించే ఏర్పాటు చేశారు.
verify-purchase

6. వెరిఫై పర్చేస్


గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు కొనుగోలు చేసే యాప్స్, గేమ్స్, బుక్స్, సినిమాలు తదితర కంటెంట్‌కు పర్చేస్ వెరిఫికేషన్‌గా ఫింగర్‌ప్రింట్, ఐరిస్‌ను పెట్టుకోవచ్చు. దీంతో ఆయా కంటెంట్‌ను కొనుగోలు చేసే ముందు బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను యూజర్ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఆ కంటెంట్‌ను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. లేదంటే వీలు కాదు. దీంతో ఇతరులు యూజర్ల డివైస్‌లలో అక్రమంగా కంటెంట్‌ను కొనుగోలు చేయలేరు.
time-spent-apps
ఇవే కాకుండా ఇంకా అనేక కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ పి లో అందిస్తున్నారు. రీడిజైన్ చేయబడిన క్విక్ సెట్టింగ్స్, వాల్యూమ్ కంట్రోల్స్, నోటిఫికేషన్స్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ రిప్లైస్, యూజర్లు ఎంత సమయం ఏయే యాప్‌లో గడిపారో తెలిపే నూతన తరహా డ్యాష్ బోర్డ్, చీకటి పడగానే ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్ చేసే డు నాట్ డిస్టర్బ్ మోడ్ వంటి అనేక ఫీచర్లను ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో అందిస్తున్నారు.

ఆండ్రాయిడ్ 9.0 పి ఓఎస్ అప్‌డేట్ గూగుల్‌కు చెందిన పిక్సల్ ఫోన్లకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. సదరు డివైస్‌లను వాడుతున్న యూజర్లు తమ ఫోన్లలో ఉన్న ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 9.0 పి కి అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ యూజర్లకు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) రూపంలో లభిస్తున్నది. ఇక ఇవే కాకుండా త్వరలో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2, షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్, నోకియా 7 ప్లస్, ఒప్పో ఆర్15 ప్రొ, వివో ఎక్స్21, ఎక్స్21 యూడీ, వన్ ప్లస్ 6 తదితర ఫోన్లతోపాటు అన్ని ఆండ్రాయిడ్ వన్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 పి అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు.

4123

More News

VIRAL NEWS