కీప్ యాప్ పేరు మార్చిన గూగుల్


Sun,September 23, 2018 11:42 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన కీప్ యాప్ పేరును కీప్ నోట్స్‌గా మార్చింది. ఈ క్రమంలోనే 5.0.371.03 వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ వెర్షన్‌తో గూగుల్ కీప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిగ్గా యాప్ పేరు కూడా మారుతుంది. ప్రస్తుతం గూగుల్ కీప్ యాప్ అప్‌డేటెడ్ వెర్షన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది. అయితే ఈ యాప్‌కు పేరు మార్చినట్లు గూగుల్ ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ పలు ఇతర గూగుల్ యాప్స్‌లోనూ గూగుల్ కీప్ యాప్ పేరు కీప్ నోట్స్‌గా దర్శనమిస్తుండడం విశేషం. ఇక గూగుల్ కీప్ నోట్స్ యాప్‌ను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. కొత్త వెర్షన్‌లో ఈ యాప్ మరింత వేగంగా పనిచేస్తుంది.

1696

More News

VIRAL NEWS

Featured Articles