ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై ల‌భిస్తున్న గూగుల్ ఫిట్ యాప్‌..!


Mon,May 6, 2019 07:18 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త‌న గూగుల్ ఫిట్ యాప్‌ను ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ యాప్ కేవ‌లం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేది. కానీ ఇక‌పై ఐఓఎస్ యూజ‌ర్లు కూడా ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ యాప్ స‌హాయంతో యూజ‌ర్లు ఆరోగ్య‌క‌రమైన జీవ‌న విధానాన్ని పెంపొందించుకోవ‌చ్చు. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అలాగే మానసికంగానూ దృఢంగా ఉంటారు. ఈ యాప్‌లో రెండు స్మార్ట్ యాక్టివిటీ గోల్స్‌ను అందిస్తున్నారు. మూవ్ మిన‌ట్స్‌, హార్ట్ పాయింట్స్ అని రెండు గోల్స్ ఈ యాప్‌లో ల‌భిస్తున్నాయి. వీటితో గుండె జ‌బ్బులను రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే ప‌లు ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు.

1435
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles