ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లకూ గూగుల్ అసిస్టెంట్..!


Thu,December 14, 2017 12:41 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన అసిస్టెంట్ యాప్‌ను ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లకు కూడా అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపైన ఓఎస్ వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. అయితే ఇకపై ఈ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలకు కూడా లభ్యం కానుంది. కాకపోతే వాటిలో కూడా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపైన వెర్షన్ ఉండాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఓఎస్‌ను వాడుతున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా గూగుల్ అసిస్టెంట్ లభించనుంది. వచ్చే వారంలో ఈ యాప్‌ యూఎస్, యూకే, ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మెక్సికో, స్పెయిన్, ఇటలీ, జపాన్, జర్మనీ, బ్రెజిల్, కొరియా దేశాల యూజర్లకు లభిస్తుంది.

గూగుల్ అసిస్టెంట్ స‌హాయంతో యూజర్లు త‌మ డివైస్‌లలో ప‌లు ప‌నులు చేసుకోవ‌చ్చు. లోక‌ల్ స‌ర్వీస్‌లు, మ్యూజిక్ ప్లే చేయ‌డం, పాట‌ల‌ను గుర్తించ‌డం, అలారంలు సెట్ చేయ‌డం, స్మార్ట్ డివైస్‌ల‌ను కంట్రోల్ చేయ‌డం వంటి ప‌నులను గూగుల్ అసిస్టెంట్ చేసి పెడుతుంది. ఇందుకు గాను యూజ‌ర్లు అసిస్టెంట్‌కు వాయిస్ క‌మాండ్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

2105

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles