అమెజాన్ సైట్‌లో గ్లిచ్.. రూ.9 లక్షల కెమెరా రూ.6500కే అమ్మకం..!


Sat,July 20, 2019 08:52 PM

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇటీవల ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించిన విషయం విదితమే. అయితే అందులో చోటు చేసుకున్న చిన్న పొరపాటు కారణంగా ఆ సైట్ భారీగా నష్టపోయింది. అందులో 13వేల డాలర్లు (సుమారుగా రూ.9 లక్షలు) విలువైన ఓ కెమెరా రేటును తక్కువగా ఉంచారు. దీంతో దాన్ని ఓ వినియోగదారుడు కేవలం 94 డాలర్ల(దాదాపుగా రూ.6500) కే కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈ విషయం కాస్తా అందరికీ తెలియడంతో అమెజాన్‌లో కెమెరాను కొనుగోలు చేసేందుకు యూజర్లు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో పలువురు యూజర్లు ఫ్యుజిఫిలిం, కెనాన్, సోనీ తదితర కంపెనీలకు చెందిన ఖరీదైన కెమెరాలను చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేశారు. 3వేల డాలర్ల ఖరీదు ఉన్న ఓ కెమెరాను ఒక యూజర్ కేవలం 94 డాలర్లకే కొన్నట్లు తెలిపాడు. అలాగే 5వేల డాలర్ల ఖరీదు ఉన్న మరొక కెమెరాను కూడా అంతే ధరకు కొనుగోలు చేశానని మరొక యూజర్ తెలిపాడు. కాగా అమెజాన్ సైట్‌లో చోటు చేసుకున్న గ్లిచ్ (సాంకేతిక సమస్య) కారణంగానే ఈ తప్పిదం చోటు చేసుకుందని తెలిసింది. దీనిపై అమెజాన్ ఇంకా స్పందించలేదు.

5975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles