భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లేతో విడుదలైన జియోనీ ఎం7 పవర్


Thu,November 16, 2017 09:27 AM

జియోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం7 పవర్‌'ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 6 ఇంచ్ భారీ డిస్‌ప్లే ఉంది. నేటి తరుణంలో వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్లలో ఉన్న విధంగా ఇందులో బెజెల్ లెస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో 18:9 ఫుల్‌వ్యూలో డిస్‌ప్లేను చూడవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీంతో ఎంత హెవీగా వాడినా ఫోన్ బ్యాటరీ 2 రోజుల వరకు వస్తుంది. ఈ ఫోన్‌ను గ్రేడ్ 6 అల్యూమినియం బ్యాక్ షెల్‌తో తయారు చేసినందున ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఫోన్‌కు బెజెల్ లెస్ డిస్‌ప్లే ఇచ్చినందున వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని టచ్ చేసి కెమెరాతో ఫొటోలు తీసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ రూ.16,999 ధరకు ఈ నెల 25వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే అమెజాన్ సైట్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఫోన్‌కు గాను ప్రీ బుకింగ్స్ నిర్వహించనున్నారు. ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు జియో 10 నెలల పాటు నెలకు 10జీబీ అదనపు డేటాను ఉచితంగా అందివ్వనుంది. అందుకు యూజర్లు రూ.309 ఆపైన విలువ చేసే ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

జియోనీ ఎం7 పవర్ ఫీచర్లు...


6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1917

More News

VIRAL NEWS