జియోనీ నుంచి ఎం7 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Mon,November 20, 2017 05:22 PM

జియోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎం7 ప్లస్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 18:9 యాస్పెక్ట్ రేషియతో కలిగిన బెజెల్ లెస్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ భారీ స్క్రీన్ ఇందులో ఉంది. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అమర్చారు. దీంతో డివైస్ వేగంగా పనిచేస్తుంది. ఈ పోన్ ధర రూ.20వేల వరకు ఉండే అవకాశం ఉంది.

జియోనీ ఎం7 ప్లస్ ఫీచర్లు...


6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ.

5722

More News

VIRAL NEWS