పాత ఫోన్ ఇవ్వండి.. కొత్త వివో ఫోన్ తీసుకెళ్లండి..!


Wed,January 16, 2019 03:40 PM

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల కోసం వివో ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఇవాళ లాంచ్ చేసింది. అందులో భాగంగా వినియోగదారులు త‌మ పాత స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త వివో స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే పొంద‌వ‌చ్చు. క్యాషిఫై అనే కంపెనీతో భాగ‌స్వామ్య‌మైన వివో ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ది. ఇవాళ్టి నుంచి ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు వినియోగ‌దారులు తాము ఎక్స్‌ఛేంజ్ చేసే పాత ఫోన్ల‌కు గాను రూ.1000 అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు. అలాగే ప‌లు వివో ఫోన్ల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. వినియోగ‌దారులు వివో ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొందాలంటే వివో ఈ-స్టోర్ కు వెళ్లి త‌మకు న‌చ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకుని ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో త‌మ పాత ఫోన్‌ను వినియోగ‌దారులు ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్త వివో ఫోన్‌ను పొంద‌వ‌చ్చు.

12428

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles