వివోయాక్టివ్ 3 స్మార్ట్‌వాచ్‌ల‌ను విడుద‌ల చేసిన గార్మిన్


Wed,January 9, 2019 04:55 PM

ఫిట్‌నెస్ ప‌రికరాల‌ను త‌యారు చేసే గార్మిన్.. వివో యాక్టివ్ 3 మ్యూజిక్ ఎల్‌టీఈ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుద‌ల చేసింది. క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ వాచ్‌ను గార్మిన్ ప్ర‌ద‌ర్శించింది. దీన్ని బ్లూటూత్ స‌హాయంతో హెడ్ ఫోన్స్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే ఎల్‌టీఈ వేరియెంట్ క‌నుక కాల్స్ చేసుకోవ‌చ్చు, ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పంపుకోవ‌చ్చు. ఇదే వాచ్‌కు గాను 3 వేరియెంట్ల‌ను గార్మిన్ విడుద‌ల చేసింది. ఒక‌టి ఎల్‌టీఈ మ్యూజిక్ కాగా, మ‌రొక‌టి మ్యూజిక్, ఇంకొక‌టి స్టాండ‌ర్డ్ వేరియెంట్‌. ఇందులో మ్యూజిక్‌, ఎల్‌టీఈ ఫీచ‌ర్లు ఉండ‌వు. ఇక ధ‌ర విష‌యానికి వ్స్తే ఈ వాచ్‌కు చెందిన మ్యూజిక్ వేరియెంట్ రూ.27,990 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, స్టాండ‌ర్డ్ వేరియెంట్‌ రూ.24,990 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. మ్యూజిక్ వేరియెంట్ వాచ్‌ల‌లో 500 పాట‌ల‌ను స్టోర్ చేసుకోవ‌చ్చు. ఇక అన్ని వాచ్‌ల‌లోనూ యాక్టివిటీ ట్రాక‌ర్ త‌దిత‌ర ఫీచ‌ర్లు కామ‌న్‌గా ల‌భిస్తున్నాయి. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు కంపానియ‌న్ యాప్ ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles