గార్మిన్ వివో యాక్టివ్ 3 స్మార్ట్‌వాచ్ విడుదల


Tue,November 21, 2017 07:28 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ 'వివోయాక్టివ్ 3' పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.24,990 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తున్నది. బ్లాక్, వైట్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్స్ డిజైన్లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది. ఇందులో 1.2 ఇంచ్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, వాటర్ రెసిస్టెంట్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కంపాటబులిటీ, స్టెప్ కౌంటర్, స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంటర్, యాక్టివిటీ ట్రాకర్, జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, బారో మీటర్, ఆల్టీమీటర్, కంపాస్, యాక్సలరోమీటర్, థర్మోమీటర్, స్ట్రెస్ మానిటర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు నిరంతరాయంగా వాడుకోవచ్చు.

2127

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles