గార్మిన్ ఫీనిక్స్ 5ఎక్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ విడుదల


Mon,September 17, 2018 04:18 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు గార్మిన్ తన నూతన స్మార్ట్‌వాచ్ ఫీనిక్స్ 5ఎక్స్ ప్లస్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. అథ్లెట్స్, ఔట్‌డోర్ అడ్వెంచర్స్ చేసే వారి కోసం ఈ వాచ్‌ను గార్మిన్ ప్రత్యేకంగా తయారు చేసింది. ఇందులో పల్స్ ఓఎక్స్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెన్సర్ ఉన్న ఏకైక స్మార్ట్‌వాచ్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా అత్యంత గరిష్టమైన ఎత్తులలో ఉన్నప్పుడు రక్తం, ఆక్సిజన్ నిష్పత్తిని సులభంగా తెలుసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌లో 1.2 ఇంచ్ డిస్‌ప్లే, జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, 500 పాటల వరకు స్టోరేజ్, ఆల్టీమీటర్, 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ రూ.79,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

1647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles