ఫ్లిప్‌కార్ట్‌లో వుమెన్స్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..


Fri,March 8, 2019 11:14 AM

వుమెన్స్ డే సంద‌ర్భంగా ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో ఇవాళ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు త‌దిత‌ర వ‌స్తువుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ XR కేవ‌లం రూ.67,999 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. అలాగే గూగుల్ పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ రూ.37,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 రూ.30,990 ధ‌ర‌కు, అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ (8జీబీ, 256 జీబీ) రూ.28,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అలాగే ఎల్‌జీ, మోటోరోలా, షియోమీ, నోకియా, హాన‌ర్ కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను కూడా చాలా త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్నారు. అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను రూ.50,990 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో హెడ్‌ఫోన్స్‌, స్పీక‌ర్ల‌పై 70 శాతం వ‌ర‌కు, స్మార్ట్‌హోమ్ డివైస్‌ల‌పై 75 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ప‌లు ఉత్ప‌త్తులపై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

1946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles