ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్లు.. 80శాతం వరకు డిస్కౌంట్లు.. వీటిపైనే


Tue,February 13, 2018 12:34 PM

న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఉత్పత్తులపై 80శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 పురస్కరించుకొని ది ఫ్లిప్‌హార్ట్ డే సేల్‌తో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఆఫర్లతో ముందుకువస్తోంది. ఈ అమ్మకాల్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ది ఫ్లిప్‌హార్ట్‌డే కోసం లాగిన్ అయిన వినియోగదారులు దుస్తులు, బ్యూటీ, యాక్సెసరీలు, గృహోపకరణాలపై అదనంగా 14శాతం డిస్కౌంట్ పొందనున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబ్లెట్లు, పవర్‌బ్యాంక్‌లతో పాటు పలు యాక్సెసరీలలో కొన్నింటికి 80శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఐతే ఏ వస్తువుపై ఈ ఆఫర్ వర్తిస్తుందో సంస్థ కచ్చితంగా వెల్లడించలేదు. మొబైల్ ఫోన్లపై మాత్రం భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

4558

More News

VIRAL NEWS